Chapter 25 of 25

chapter 25

Ho my love272 words~2 min read

ఈ పిల్ల వుందే ఏదో ఒక రోజు మా కొంప ముంచుతుంది. ఈ కెమెరామెన్ గాడు ఎక్కడున్నాడు వెంటనే ప్రోగ్రాం కట్ చేయమని చెప్పాలి అనుకుంటూ ముందుకు అడుగులు వేశాడు.విక్రమ్ చిన్నగా నవ్వుతూ… తప్పకుండా తన గురించి చెప్పకపోతే ఎలా!? తను నాలా కాదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా తనకు నచ్చిందే చేసే మొండిఘటం. ఎవరి సపోర్ట్ లేకుండా లైఫ్ లో తను అనుకున్న గోల్స్ సాధించి తను ఏంటో అందరికీ తెలిసేలా చేయాలని అనుకుంటుంది ఆ ప్రయత్నంలోనే ఉంది! అని అన్నాడు. ఓ నైస్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనకి సెల్ఫ్ కాన్ఫరెన్స్ ఎక్కువలా అనిపిస్తుంది. మీరు తనకి ఏదైనా చెప్పాలనుకుంటే మా ఛానల్ ద్వారా చెప్పొచ్చు అని అంది అనన్య. విక్రమ్ నవ్వుతూ నేను తనకి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే తను ఏదైనా సాధించాలి అనుకుంటే కచ్చితంగా సాధించే వరకు వదిలిపెట్టని మొండిగటం. ఎనీవే మీరు ఇంత కడుగుతున్నారు కాబట్టి all the best my lovely sister!  అనన్య గారు మీరు కూడా మా సిస్టర్ కి ఆల్ ద బెస్ట్ చెప్పండి అన్నాడు.“All the best for your future success miss… miss..” అంటూ విక్రమ్ వైపు చూసింది. హో తన పేరేంటోనని అడుగుతున్నారా!? సారీ అనన్య గారు మా సిస్టర్ పేరు బయట చెప్పడం తనకి ఇష్టం లేదు.  తను ఎలానో నా ఇంటర్వ్యూ చూస్తూ ఉంటుంది కాబట్టి మీరు చెప్పిన ఆల్ ద బెస్ట్ తనకేనని అర్థమయిపోతుంది” అన్నాడు విక్రమ్. మరోవైపు కంప్యూటర్ స్క్రీన్ మీద కూర్చుని వాళ్ళిద్దరూ కాన్వర్జేషన్ వీడియో నా ఆదిత్య కి సడన్గా తన తమ్ముడు చేసిన మెసేజ్ గుర్తుకు వచ్చింది. ‘అన్నయ్య నిన్ను ఒకసారి కలవాలి!’  అని తన తమ్ముడు చేసిన చేసిన మెసేజ్ ని తలుచుకొని మొబైల్ అందుకున్నాడు కానీ వాళ్ళ నాన్న అన్న మాటలు గుర్తుకొచ్చి వెంటనే దాన్ని పక్కన పడేసాడు.  ఆ గొడవ తర్వాత ఆదిత్య ఇంటికి వెళ్ళింది  రెండు మూడుసార్లు హాస్టల్లోనే ఉండి చదువుకున్నాడు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఫోకస్ మొత్తం కెరియర్ పైన పెట్టాడు. “ఫ్యామిలీ, రిలేషన్స్ అంటూ చుట్టూ మనుషులు  ఆడే ఎమోషన్స్ డ్రామాలు చూడటం నాకు అసహ్యం!” అనుకున్నాడు. విక్రమ్ ఆదిత్య ఇద్దరూ అతి చిన్న వయసులోనే బిజినెస్ లో సక్సెస్ అయ్యారు కానీ ఇద్దరికీ వ్యక్తిత్వంలో చాలా తేడా ఉంది. అందరూ మనవాళ్లే అని విక్రమ్ అనుకుంటే… మనవాళ్ళు అయినా మనకంటే ఎక్కువగా ఎదుగుతుంటే ముంచేయాలి అనేది ఆదిత్య ఫిలాసఫీ.To be continued....

Contents
Last Chapter
Contents
Next